ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర మంత్రి అతిశీ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం విద్యాశాఖ, ప్రజాపనుల(Public Works) విభాగం మంత్రిగా ఉన్న ఆమెను CM పదవికి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో కేజ్రీవాల్ ఈ ప్రతిపాదన చేయగా అందరూ ఆమోదించారు.
ఆప్ అధినేత జైలుకు వెళ్లిన తర్వాత పార్టీని నడపడంలో, అధికారిక కార్యక్రమాలు నిర్వహించడంలో అతిశీ కీలక పాత్ర పోషించారు. లెఫ్టినెంట్(Lieutenant) గవర్నర్ తో ఈరోజు మధ్యాహ్నం సమావేశమైన తర్వాత కేజ్రీవాల్ తప్పుకోనుండగా.. అతిశీ బాధ్యతలు చేపడతారు.