
‘జై తెలుగు’ పేరుతో స్టార్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో పార్టీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు భాషా పరిరక్షణ కోసమంటూ సినీ లిరిక్ రైటర్ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు… ‘జై తెలుగు’ పార్టీని స్టార్ట్ చేశారు. తెలంగాణ భాష మొత్తం ఒక్కటే.. కానీ ఏపీలో మాత్రం ప్రాంతాల వారీగా మారిపోతుంది. ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా-గుంటూరు, నెల్లూరు, రాయలసీమ అంటూ 5 రకాలు మాట్లాడుతున్నారు. మన భాషను మనమే విస్మరించి చులకన అవుతున్నామంటూ పార్టీ ప్రకటన చేశారు జొన్నవిత్తుల. ఆగస్టు 15 నాటికి విధివిధానాలు తెలియజేస్తామన్నారు.
