ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(PCC) అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ పదవికి వివిధ వర్గాల నుంచి విపరీతమైన పోటీ వచ్చినా హైకమాండ్(AICC) మాత్రం మహేశ్ కుమార్ కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా, శాసనమండలి సభ్యుడి(MLC)గా ఉన్నారు. మధుయాష్కీగౌడ్ తుది వరకు అధ్యక్ష రేసులో ఉన్నారు.