
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఖాళీగా ఉన్న జిల్లాల అధ్యక్షుల(Presidents) స్థానాల్లో కొత్తవారిని నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. మూడు జిల్లాల్లో కొత్త ప్రెసిడెంట్లకు బాధ్యతలు కట్టబెట్టింది. నిర్మల్ DCC ప్రెసిడెంట్ గా కుచడి శ్రీహరిరావును నియమించింది. కుంభం అనిల్ కుమార్ రెడ్డి BRSలో చేరడంతో ఖాళీ అయిన యాదాద్రి భువనగిరి DCC బాధ్యతలకు అందెం సంజీవరెడ్డిని ఎంపిక చేశారు. జనగామ జిల్లాకు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ పార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకుంది.