
పంచాయతీ ఎన్నికల్లో నేడు రెండో విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 4,332 GPలకు గాను 415 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,911 పంచాయతీలకు గాను 5 చోట్ల నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అవి మినహా మిగతా గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయి. 38,322 వార్డులకు గాను 8,304 ఏకగ్రీవమయ్యాయి. రెండ్రోజులుగా జోరుగా సాగిన లోపాయికారీ మంతనాలు, బుజ్జగింపులు పూర్తి కాగా, ఇక ఓటర్లను సెంటర్లకు తీసుకువచ్చే పని మీద దృష్టిపెట్టారు అభ్యర్థులు.