మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే కొద్ది మందిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Gadkari) ఒకరు. సొంత పార్టీ నేతలపై విమర్శలు(Critics), విపక్షాలపై ప్రశంసలు ఆయనకు అలవాటే. ఈసారి కూడా ఆయన సెటైరికల్ గా మాట్లాడి అందర్నీ నవ్వించారు. మహారాష్ట్రలోని తన సొంత నగరమైన నాగపూర్లో జరిగిన కార్యక్రమానికి మరో మంత్రి రాందాస్ అథావలెతో కలిసి గడ్కరీ హాజరయ్యారు. పలు ప్రభుత్వాల్లో మంత్రి పదవి దక్కించుకున్న రాందాస్ ను ఆటపట్టించారు.
‘మేం నాలుగోసారి అధికారంలోకి వస్తామో లేదో చెప్పలేం.. కానీ అథావలె మాత్రం మరోసారి కేంద్ర మంత్రి అవుతారని కచ్చితంగా చెప్పగలను..’ అంటూ మాట్లాడటంతో సభంతా నవ్వులమయమైంది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI) నేత అథావలె కంటిన్యూగా మూడోసారి మోదీ క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. త్వరలోనే మహారాష్ట్ర ఎన్నికలు జరగనుండగా.. శివసేన(షిండే)-BJP-NCP(అజిత్ పవార్) కూటమి మహాయుతిలో భాగస్వామి అయిన RPI 10-12 స్థానాలు ఆశిస్తున్నది. 2011లో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి 2013లో NDAలో చేరారు.