కేంద్ర ప్రభుత్వంపై రేపు లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని విపక్ష కూటమి I.N.D.I.A నిర్ణయించింది. మణిపూర్ అల్లర్లపై మౌనం వీడి ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు సమావేశాల నాలుగో రోజైన ఇవాళ విపక్ష MPలు నిరసనను కంటిన్యూ చేశారు. దీనిపై స్పందించిన అమిత్ షా.. మణిపూర్ అంశంపై రెండు సభల్లోనూ చర్చకు సిద్ధమంటూ లేఖలు రాశారు. కాంగ్రెస్ రాజ్యసభాపక్ష నేతగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు లోక్ సభా పక్ష నేత అధీర్ రంజన్ చౌదరికి లెటర్లు పంపించారు. అయితే ప్రధాని మాత్రమే ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
బుధవారం తీర్మానం ప్రవేశపెడతామని అధీర్ రంజన్ చౌదరి వెల్లడించారు. ఇందుకోసం ఆ పార్టీ సభ్యులకు విప్ కూడా జారీ అయింది. మంగళవారం ఉదయం సమావేశమైన I.N.D.I.A కూటమి.. వివిధ పార్టీల ఒపీనియన్స్ తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్ కు రెడీ అవుతున్నట్లు సంకేతాలిచ్చింది. లోక్ సభలో ప్రస్తుతం BJP నేతృత్వంలో NDA కూటమికి 330 మంది సభ్యుల మద్దతు ఉంది. మొత్తం 543 స్థానాలకు గాను 5 ఖాళీగా ఉన్నాయి. I.N.D.I.A కూటమికి 140 మంది MPలు ఉండగా.. మరో 60 మంది తటస్థ సభ్యులున్నారు.