కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ అధ్యక్షుడు(Former President) రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు(Filed Nomination) చేశారు. గత ఎన్నికల్లో తనకు అచ్చొచ్చిన కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి ఆయన నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తన అఫిడవిట్ లో పలు కీలక విషయాలు వెల్లడించారు. గత ఐదేళ్ల కాలంలో రూ.6 కోట్లు సంపాదించినట్లు తెలిపారు.
ఆస్తులు ఇలా…
సోదరి ప్రియాంకతో కలిసి 2 కిలోమీటర్ల రోడ్ షోతో రాహుల్ నామినేషన్ ఫైల్ చేశారు. మొత్తం రూ.20.4 కోట్ల ఆస్తులున్నాయని కాంగ్రెస్ అగ్రనేత తన అఫిడవిట్(Affidavit)లో తెలియజేశారు. మార్చి 15 నాటికి తన చేతిలో రూ.55 వేలు, రెండు బ్యాంకు అకౌంట్లలో రూ.26,25,157 ఉన్నాయన్నారు. 18 క్రిమినల్ కేసులున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీని ఇంటిపేరుతో దూషించి పార్లమెంటు సభ్యత్వం నుంచి బహిష్కరణకు గురై సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉపశమనం(Relief) పొందిన కేసుతోపాటు మిగతా కేసులను ప్రస్తావించారు.
సొంత ఇంటికి…
2019 ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ లోని అమేఠీ, కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన ఆయన.. ఇక్కడ CPI అభ్యర్థి పి.పి.సునీర్ పై 4 లక్షల ఓట్లతో గెలుపొందారు. కానీ కాంగ్రెస్ కు కంచుకోట అయిన అమేఠీలో BJP క్యాండిడేట్ స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ దారుణంగా ఓడిపోయారు. వయనాడ్ తన సొంత ఇల్లులా భావిస్తున్నానన్న ఆయన.. బండీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో గల వయనాడ్ లో రాత్రి పూట హైవేపై రాకపోకలు నిషిద్ధం.