రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లకు సంబంధించి ఇప్పటివరకు ఏ కమిటీలోనూ చోటు దక్కని పొన్నం ప్రభాకర్ కు.. పార్టీ ఎట్టకేలకు కీలక స్థానం కట్టబెట్టింది. పలువురు సీనియర్ లీడర్లు ప్రాతినిధ్యం వహించే కమిటీకి ఆయన్ను ఛైర్మన్ గా నియమించింది. OBC డిక్లరేషన్ తయారీకి గాను కమిటీ వేసి దానికి ఆయన్ను ఛైర్మన్ గా నియమించారు. OBC డిక్లరేషన్ లో అనుసరించాల్సిన సలహాలు, సూచనలు చేర్చాల్సిన అంశాలు, సిఫారసులపై ఈ కమిటీ రిపోర్ట్ తయారు చేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ కమిటీకి సహ ఛైర్మన్లుగా నూతి శ్రీకాంత్ గౌడ్, ఎర్ర శేఖర్ ముదిరాజ్, ఈరవత్రి అనిల్, జె.జైపాల్, గాలి అనిల్ కుమార్ పటేల్, తోటకూర వజ్రేశ్ యాదవ్ ఉంటారు. రాష్ట్రంలో OBCల సంక్షేమం కోసం నిర్వహించే సమావేశాల వంటివన్నీ పొన్నం నేతృత్వంలోని కమిటీయే నిర్ణయిస్తుంది.
అడ్వయిజరీ కమిటీ చీఫ్ ప్యాట్రన్ లుగా PCC మాజీ అధ్యక్షులు వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య.. సలహాదారులుగా మధుయాస్కీ గౌడ్, మహేశ్ కుమార్ గౌడ్, కొండా సురేఖ, అంజన్ కుమార్ యాదవ్, సురేశ్ షెట్కార్, డా.కత్తి వెంకటస్వామి, సంగిశెట్టి జగదీశ్వర్ రావును హస్తం పార్టీ నియమించింది. ఇక ప్రోగ్రామ్ కోఆర్టినేటర్ గా వీర్లపల్లి శంకర్ కు బాధ్యతలు కట్టబెట్టగా.. కమిటీ మెంబర్స్ గా మరో 37 మంది పేర్లను ప్రకటించింది.