
లోక్ సభాపతిగా ఓం బిర్లా మరోసారి ఎన్నికయ్యారు. వరుసగా ఆయన రెండుసార్లు ఈ పదవికి ఎన్నికయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలుత తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, రాజ్ నాథ్ సింగ్ మరోసారి ప్రతిపాదించారు. స్పీకర్ ఎన్నికపై ప్రొటెం స్పీకర్ మెహతాబ్ భర్తృహరి ఓటింగ్ నిర్వహించారు. రాజస్థాన్ లోని కోట(Kota) నుంచి ఓం బిర్లా విజయం సాధించారు. ఆయన అక్కణ్నుంచి మూడోసారి గెలుపొందారు.
సభాపతి స్థానం వరకు ఓం బిర్లాను ప్రధాని మోదీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోడ్కొని వెళ్లారు.