
ఉమ్మడి రాష్ట్రంలో అమ్మిన ప్రభుత్వ భూముల్ని తెలంగాణ వచ్చిన తర్వాత స్వాధీనం(Recovery) చేసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి KCR… అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ MLAలు ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంలో భూమే మిగలకుండా సర్కారీ భూముల్ని విచ్చలవిడిగా విక్రయానికి పెడుతున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శానససభ్యుల బృందం… పలువురు మంత్రులను కలుసుకొంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లను కాంగ్రెస్ టీమ్ కలుసుకుంది.