లోక్ సభ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఈ ఒక్కరోజే 65 మంది నామినేషన్లు వేయగా.. ఈ మూడు రోజుల్లో వాటి సంఖ్య 194కు చేరుకుంది. మొత్తం 156 మంది అభ్యర్థులు(Candidates) ఈ మూడు రోజుల్లో 194 నామినేషన్లు సమర్పించారు. లోక్ సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సైతం నోటిఫికేషన్ ఇచ్చినా ఇంతవరకు ఒక్క నామినేషన్ కూడా రాకపోవడం విశేషంగా మారింది.