MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. BRS సర్కారుపై ప్రేమ కురిపిస్తూనే కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. జాతీయ, రాష్ట్ర నేతలైన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ పతనం కాక తప్పదని అన్న ఒవైసీ.. హైదరాబాద్ లో పోటీపై కీలక కామెంట్స్ చేశారు. ‘తెలంగాణలో జరిగే ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేయాలి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ లోనే పోటీ చేయాలని సవాల్ విసురుతున్నా.. ఆయన పోటీ చేస్తే మజ్లిస్ పార్టీ సత్తా ఏంటో చూపిస్తాం.. ఈసారి కూడా మా సపోర్ట్ కేసీఆర్ కే.. ఈ ఎలక్షన్లలో ప్రజలు KCRకే మద్దతివ్వాలని కోరుతున్నా.. రాష్ట్రంలో ముక్కోణపు పోరు ఉందన్నది నిజం.. కాంగ్రెస్ పతనం కోసమే PCC ప్రెసిడెంట్ పనిచేస్తున్నారు’ అని అసదుద్దీన్ మాట్లాడారు.