పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC) సమావేశాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీ BRS బహిష్కరించింది. తమ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన అరికెపూడి గాంధీని PAC ఛైర్మన్ గా నియమించడంపై కొద్ది రోజుల క్రితం పెద్ద గొడవ జరిగింది. హుజూరాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ వర్గాలు బాహాబాహీ(Fighting)కి దిగాయి. ఇలా ఇరువర్గాల మధ్య ఘర్షణ ఏర్పడ్డ వాతావరణంలో.. తాజాగా శాసనసభలో PAC భేటీ ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంపై తెలంగాణ భవన్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్న BRS నేతలు.. PAC ఛైర్మన్ నియామకంపై ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడైన KCR సూచన మేరకే గులాబీ పార్టీకి చెందిన వ్యక్తికి పదవి కట్టబెట్టాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎల్.రమణ అన్నారు.