సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ సందర్భంగా జనగామ నియోజకవర్గంలో జగడం చోటుచేసుకుంది. ఇరు పార్టీల(Two Parties)కు చెందిన నేతలు పోలింగ్ సెంటర్ వద్ద హడావుడి సృష్టించారు. పోలింగ్ తీరును పరిశీలించేందుకు కాంగ్రెస్ లీడర్ ప్రశాంత్ రెడ్డి బాలికల ఉన్నత పాఠశాల(Girls High School)లోని సెంటర్ కు వెళ్లారు. ఆయన పోలింగ్ కేంద్రానికి రావడంపై BRS ఏజెంట్ అభ్యంతరం(Objection) తెలిపాడు. దీంతో నన్ను నువ్వు ఆపేది ఏంటంటూ కాంగ్రెస్ లీడర్.. ఎలా వెళ్తారంటూ ఏజెంట్ గొడవకు దిగడంతో గందరగోళం ఏర్పడింది.
ఎమ్మెల్యే రంగప్రవేశంతో…
తమ ఏజెంట్ ను ఇబ్బంది పెడుతున్నారంటూ MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి రంగ ప్రవేశం చేయడంతో సదరు పోలింగ్ సెంటర్ వద్ద పరిస్థితి(Situation) మరింత ఉద్రిక్తం(Serious)గా మారింది. అధికార పార్టీ నేతలు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారంటూ MLA ఆరోపణలు చేయడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత కనిపించింది. దీంతో పోలీసులు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టడంతో వాతావరణం శాంతించింది.