బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాజ్యాంగాన్ని గౌరవించని వ్యక్తిని ఎన్ని పేర్ల(Names)తో పిలిచినా ఏం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్… CM జగన్ పై మండిపడ్డారు. జగన్.. జగ్గూభాయ్.. వరకూ వచ్చాం.. ఇక జగ్గూ అని పిలిచేందుకు రెడీ అని తణుకు సభలో స్పష్టం చేశారు. ‘నన్ను ఏదైనా అనొచ్చు కానీ.. నేను అనకూడదా… మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం.. జగన్ నిన్ను జగ్గూభాయ్ అని ఎందుకంటున్నానో తెలుసా.. డిజిటల్ దొంగలా మారి ప్రజల డబ్బు దోచేస్తున్నావ్… నీ దోపిడీని కాగ్ రిపోర్ట్ బయటపెట్టింది. అబద్ధాలాడి సమర్థించుకునే రోగం ఉంది’ అంటూ తీవ్రస్థాయిలో కామెంట్లు చేశారు.
హిందువులకేనా… ఇతర మతస్థులకు కూడానా…
లిక్కర్ పేరిట రూ.30 వేల కోట్లు కొట్టేశారని, ధరలు పెంచారు కాబట్టే చాటుమాటుగా తిరుగుతున్నారంటూ జగన్ ను విమర్శించారు. రాజకీయ అవినీతి(Political corruption)ని ఆపేందుకే పాలిటిక్స్ కు వచ్చానని, దానిపై జనసేన పోరాటం కొనసాగుతుందని పవన్ స్పష్టం చేశారు. జగన్ హయాంలో 219 ఆలయాలపై దుర్ఘటనలు జరిగాయి.. విగ్రహాల ధ్వంసం కేసులో దోషులను ఇప్పటికీ పట్టుకోలేదు.. హిందూ ధర్మానికేనా, ఇతర మతాలకూ ఇలాగే చేస్తారా అంటూ జగన్ పాలనపై ఫైర్ అయ్యారు.