
కాంగ్రెస్ చేసిన అభివృద్ధికి జూబ్లీహిల్స్ ఫలితమే నిదర్శనమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలుపు తమదేనని, 100 సీట్లు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. BJP ఏ స్థాయికి దిగజారిందో చూస్తూనే ఉన్నామన్నారు. BC రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కు ఉన్న కమిట్మెంట్ ను ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. BC బిడ్డను గెలిపించడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని మహేశ్ కుమార్ అన్నారు. అధికార దుర్వినియోగం వల్లే గెలిచారన్న KTR మాటలపై.. ఓడిన ప్రతిపార్టీ ఇలాగే మాట్లాడుతుందని, ప్రజలు బటన్ నొక్కనిదే ఓట్లు పడబోవన్నారు.