ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(PCC) అధ్యక్షుడంటే ఎప్పుడూ గందరగోళమే. ఒక వర్గం నుంచి విమర్శలు, మరో వర్గం నుంచి ఆరోపణలు.. ఇవన్నీ తట్టుకుని నిలబడాలంటే ఎంతో నిబ్బరం ఉండాలి. అలాంటి పదవిని హుందాగా నిర్వహించడమే కాకుండా పార్టీని అధికారంలోకి తెచ్చేలా వ్యవహరించిన ఆ వ్యక్తి ధర్మపురి శ్రీనివాస్(DS). రాజకీయ జీవిత చరమాంకంలో పార్టీ మారిన DS(76) కన్నుమూశారు.
2004, 2009 కాలంలో ఒకవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి దూసుకుపోతుంటే ఆయనకు దీటుగా పార్టీ వ్యవహారాలు నడిపించిన వ్యక్తి DS. హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్రంలో PCC చీఫ్ గా, మంత్రిగా పనిచేసిన ఆయన.. స్టూడెంట్ లీడర్ గా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
1989, 1999, 2004లో నిజామాబాద్ నుంచి MLAగా ఎన్నికై.. 1989 నుంచి 1994 వరకు రూరల్ డెవలప్మెంట్, I&PR మంత్రిగా ఉన్నారు. 2004-2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ మంత్రిగా పనిచేశారు. 2103 నుంచి 2015 వరకు MLCగా ఉన్నారు. 2015లో కాంగ్రెస్ వీడి BRSలో చేరిన ఆయన 2016 నుంచి 2022 వరకు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. ఆ తర్వాత KCRతో విభేదించి పార్టీకి దూరమయ్యారు.