కొత్తగూడెం MLA వనమా వెంకటేశ్వర్ రావుకు మరోసారి హైకోర్టులో షాక్ తగిలింది. ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని వేసిన మధ్యంతర పిటిషిన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదంటూ మూడు రోజుల క్రితం హైకోర్టు తీర్పునిచ్చింది. జలగం వెంకట్రావును కొత్తగూడెం MLAగా ప్రకటిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. తనను MLAగా గుర్తించాలంటూ అసెంబ్లీ(Assembly) సెక్రటరీతోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ను వెంకట్రావు కలిశారు. సిట్యుయేషన్ సీరియస్ గా ఉందని భావించిన వనమా.. నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ హైకోర్టు ఆ పిటిషన్ ను తీసుకోవడానికి నిరాకరించింది.
2018 ఎన్నికల్లో వనమా వెంకటేశ్వర్ రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ మాజీ MLA అయిన జలగం 2019లో హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్ లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు.