ఫేక్ అఫిడవిట్(Fake Affidavit) సమర్పించారన్న కారణంతో ఇప్పటికే ఒక MLAపై అనర్హత వేటు పడగా… ఇప్పుడు మంత్రి కేసులోనూ విచారణ కొనసాగుతోంది. ధర్మపురి నుంచి MLAగా గెలిచి మంత్రిగా పనిచేస్తున్న కొప్పుల ఈశ్వర్ కేసులో విచారణ నడుస్తోంది. కేసులో భాగంగా కోర్టులో మంత్రికి అనూహ్య పరిణామం ఎదురైంది. తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ క్యాండిడేట్ లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్ ను రిజెక్ట్ చేయాలని కొప్పుల ఈశ్వర్ అభ్యర్థించగా… కోర్టు అందుకు నిరాకరించింది. ఈశ్వర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. మంత్రి వేసిన మధ్యంతర పిటిషన్ ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.
మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై దాఖలైన పిటిషన్ మీద విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. కొత్తగూడెం MLA వనమా వెంకటేశ్వర్ రావుపై అనర్హత వేటు పడటం.. మిగతా శాసనసభ్యులపై కేసులు విచారణకు వస్తుండటంతో తీర్పులు ఎలా ఉంటాయోనన్న ఎగ్జయిట్ మెంట్ అందరిలో కనిపిస్తున్నది.