
బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీలో, ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలోనూ దేశం పేరైన ఇండియా ఉందని… ఇప్పుడు ఇండియా పేరు పెట్టుకున్నంత మాత్రాన ప్రతిపక్షాలన్నీ నీతిమంతమైనవి కాలేవని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విమర్శించారు. ఇంత దిక్కుమాలిన ప్రతిపక్షాన్ని ఎన్నడూ చూడలేదని ఫైర్ అయ్యారు. దేశం పేరును ఉపయోగించడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించలేరని మోదీ అన్నారు. పార్లమెంటు ఉభయసభల్లో అనుసరించాల్సిన ప్లాన్ పై చర్చించేందుకు BJP పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది.
విపక్ష కూటమి అనుసరిస్తున్న తీరుపై మోదీ అధ్యక్షతన జరిగిన ఈ పార్లమెంటరీ పార్టీ భేటీలో కీలకమైన చర్చ నిర్వహించారు.