ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించడం పట్ల ప్రధాని మోదీ మాట్లాడారు. ఇది అభివృద్ధి, ఉత్తమ పాలనకు నిదర్శనమని కొనియాడారు. ఆయన మాటల్లోనే…
‘మమ్మల్ని గెలిపించిన ఢిల్లీ ప్రజలందర్నీ గుండెల్లో దాచుకుంటాం.. హస్తినను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే మా కర్తవ్యం.. ప్రజల జీవన స్థితిగతుల్ని మార్చుతాం.. దేశ అభివృద్ధిలో ఢిల్లీ పాత్ర ప్రముఖంగా ఉండనుంది.. ప్రజలకు అత్యుత్తమ సేవ చేసే భాగ్యం లభించడానికి ప్రతి BJP కార్యకర్తా కష్టపడి పనిచేశారు.. అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫాం అయిన ‘X’లో పోస్ట్ చేశారు.