యుద్ధం అంతకంతకూ తీవ్రమవుతున్న తరుణంలో ఉక్రెయిన్(Ukraine)ను సందర్శించబోతున్నారు ప్రధాని మోదీ. ఆగస్టు 23న ఆయన టూర్ మొదలు కానుండగా.. 30 ఏళ్ల తర్వాత రాజధాని కీవ్ లో అడుగుపెట్టే భారత ప్రధానిగా మోదీ నిలవబోతున్నారు. ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ కోరిక మేరకు మోదీ అక్కడ పర్యటించబోతున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి తన్మయలాల్ తెలియజేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నివారణకు తాము ముందు నుంచీ అనుసరిస్తున్న విధానాల్ని వివరించడంతోపాటు భారత్-ఉక్రెయిన్ సంబంధాల పురోగతిపై ఇరు దేశాధినేతలు చర్చిస్తారు. ఈ మధ్యనే మోదీ రష్యాలో పర్యటించగా, ఇప్పుడు ఉక్రెయిన్ లోనూ అడుగుపెట్టబోతున్నారు.