ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ చేరుకున్నారు. హైదరాబాద్ హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన… అక్కణ్నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వరంగల్ కు స్టార్ట్ అయి మామునూర్ ఎయిర్ స్ట్రిప్ నకు రీచ్ అయ్యారు. వారణాసి నుంచి స్పెషల్ ఫ్లైట్ ద్వారా రాష్ట్రంలో అడుగుపెట్టిన మోదీకి గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, CS, DGP స్వాగతం పలికారు. భద్రకాళి టెంపుల్ కు చేరుకుని 15 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. మోదీతోపాటు ఆరుగురు అర్చకులకు మాత్రమే ఆలయంలోకి అనుమతి ఉంది.
భద్రకాళి టెంపుల్ చుట్టూ SPG, NSG బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తం 3,500 మంది పోలీసులు, బలగాలతో భద్రత కల్పిస్తున్నారు. గర్భగుడి ఎదుట 5 నిమిషాలు ధ్యానం చేయనున్న PM… అక్కణ్నుంచి హన్మకొండ ఆర్ట్స్ కాలేజీకి చేరుకుంటారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయనకు అందించేందుకు టెంపుల్ మేనేజ్ మెంట్… 6 రకాల ప్రసాదాలు సిద్ధం చేసింది.