లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ దేశవ్యాప్తంగా 400 సీట్లే లక్ష్యంగా దూసుకుపోతున్న భారతీయ జనతాపార్టీ(BJP)కి ఊహించని పరిణామం ఎదురైంది. హరిణాయా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా(Resignation) చేశారు. రాజీనామా లేఖను ఆయన గవర్నర్ కు పంపారు. దీంతో లోక్ సభ ఎన్నికల ముందు హరియాణాలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. BJP- జన నాయక్ జనతా పార్టీ(JJP) కూటముల మధ్య చీలిక(Rift)లు ఏర్పడ్డాయి.
బలాబలాలు ఇలా…
హరియాణా అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలుండగా… BJPకి 41 మంది ఎమ్మెల్యేలున్నారు. అటు ఇప్పటిదాకా మద్దతిచ్చిన JJPకి 10 మంది MLAలున్నారు. ఐదుగురు స్వతంత్రులు(Independents)తోపాటు HLPకి ఒక సభ్యుడు ఉన్నారు. మద్దతును జన నాయక్ జనతా పార్టీ ఉపసంహరించుకోవడంతో మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అక్కడ సంక్షోభం తలెత్తడంతో కేంద్ర మంత్రి అర్జున్ ముండా, BJP సీనియర్ నేత తరుణ్ ఛుగ్ ఆగమేఘాల మీద హరియాణా వెళ్లారు.