
రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొన్ని చోట్ల గొడవకు దారితీశాయి. కాంగ్రెస్-BRS మధ్య ఘర్షణలు జరగ్గా, కొన్నిచోట్ల గులాబీ పార్టీలోని వర్గపోరు రోడ్డుకెక్కింది. నాగర్ కర్నూల్ జిల్లా అవంచలో BRS వర్గపోరు దాడి దాకా వెళ్లింది. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ MLA మర్రి జనార్దన్ రెడ్డి అనుచరులు సర్పంచ్ పదవికి నిలబడ్డారు. లక్ష్మారెడ్డి సొంత గ్రామం అవంచ కాగా, ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ ఇరువర్గాలు దాడి చేసుకున్నాయి. అటు వేరే గ్రామం వాళ్లు వచ్చి ప్రచారం చేస్తున్నారంటూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో BRS ఆరోపించడంతో కాంగ్రెస్ శ్రేణులు గొడవకు దిగాయి.
మెదక్ జిల్లా నర్సంపల్లి పెద్దతండా సర్పంచ్ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కారు. ప్రత్యర్థులు డబ్బులిస్తున్నారని, గతంలోనూ తాను సర్పంచిగా ఓడిపోయానంటూ ఆవేదన చెందాడు. ఇలా ఆయా జిల్లాల్లో ఘర్షణలు జరుగుతుండగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.