
మహాలక్ష్మీ పథకంతో కుటుంబాల వాతావరణం మెరుగుపడిందని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బంధుత్వాలు పెరగడం, ఆలయాల సందర్శన, ఆస్పత్రుల్లో చికిత్సలు, విద్యా వ్యవస్థ
మెరుగుపడ్డాయన్నారు. ఉపాధి అవకాశాల కోసం మహిళలు RTCని ఉపయోగించుకున్నారన్నారు. ఈ స్కీంకు నేటి(డిసెంబరు 9)తో రెండేళ్లు పూర్తయ్యాయి. ఇప్పటిదాకా 251 కోట్ల మంది 8,459 కోట్ల విలువైన ప్రయాణాన్ని పొందారని మంత్రి తెలిపారు. 2023 డిసెంబరు 9న మహాలక్ష్మీ పథకం ప్రారంభం కాగా.. మహిళలకు ఉచితంగా ఇచ్చే టికెట్ల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం TGSRTCకి అందజేస్తోంది