రాష్ట్రంలో చోటుచేసుకున్న వరద బీభత్సంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ CM రేవంత్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. వరద(Flood) పరిస్థితులు, జరిగిన నష్టం గురించి అడిగారు. పలు జిల్లాల్లో వాటిల్లిన నష్టంతోపాటు ఖమ్మం జిల్లాలో తీవ్రత ఎక్కువగా ఉందని రేవంత్ వివరించారు. ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించారంటూ రాష్ట్ర యంత్రాంగాన్ని మోదీ అభినందించారు.
ప్రతికూల పరిస్థితుల్లో సేవలందించే హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. అవసరమైన వరద సహాయక చర్యలను కేంద్ర ప్రభుత్వం తరఫున అందిస్తామని భరోసా ఇచ్చారు.