
Published 24 Nov 2023
త్యాగాలు, బలిదానాలతో ఏర్పడ్డ రాష్ట్రంలో రైతుల భూములు(Farmers Lands) లాక్కునే ప్రభుత్వం ఇప్పటిదాకా పాలన సాగిస్తున్నదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించాలంటే ఓటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. తొర్రూరు, పాలకుర్తి సభల్లో పాల్గొన్న ప్రియాంక.. పార్టీల నీతి ఎలాంటిది, వారి విధానాలు ఎలా ఉన్నాయని గమనించిన తర్వాతే ఓటు వేయాలని కోరారు. ఈ పదేళ్లలో ఎంతమందికి ఉపాధి లభించిందో చెప్పాలంటూ సభకు హాజరైన వారిని ప్రశ్నించారు. పేపర్ లీక్ ల వల్ల ఎంతోమంది అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఒక యువతి బలవన్మరణానికి పాల్పడితే దాన్ని తప్పుదారి పట్టించిన ప్రభుత్వం తెలంగాణలో ఉందని ప్రియాంక విమర్శించారు. కొత్త రాష్ట్రం ఏర్పడితే ఎంతో డెవలప్మెంట్ ఉంటుందని అనుకున్నామని, కానీ ప్రజలను ఈ సర్కారు మరింత చీకట్లోకి నెట్టిందని అన్నారు.