Published 27 Nov 2023
కేసీఆర్ పాలన కుంభకోణాల(Scams) మయంగా మారిందని, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఆ పార్టీకి లేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. రాష్ట్రంలో లిక్కర్, ఇసుకతో సహా అన్నింటినీ దోచుకుంటున్నారని, ఇలాంటి ప్రభుత్వం అవసరమా అని ప్రశ్నించారు. ప్రచారంలో భాగంగా గద్వాల, కొడంగల్ విజయభేరి సభల్లో పాల్గొన్న ఆమె.. రైతులు, మహిళలకు డబ్బులివ్వడానికి మనసు రావడం లేదని, ఫామ్ హౌస్ నుంచి KCR పాలన చేస్తున్నారని విమర్శించారు.
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఏ అవసరం ఉన్నా కేసీఆర్ సహకారం అందిస్తారని, రెండు పార్టీల అంతర్గత సంబంధాల(Internal Relationships)పై ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుందని ప్రియాంక అన్నారు. రాజస్థాన్ లో పెద్ద పెద్ద సర్జరీలు సైతం హాస్పిటల్స్ లో పేదలకు ఉచితంగా అందిస్తున్నామని.. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఉన్నతస్థాయిలో విద్యాలయాలు ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు.