
బ్రెజిలియన్ మోడల్ పేరుతో హరియాణాలో 22 ఓట్లు పోలయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘స్వీటీ’, ‘సీమ’, ‘సరస్వతి’ పేర్లతో ఆమె ఫొటోలు ఉన్నాయని, ఆ రాష్ట్రంలో దొంగ ఓట్ల వల్లే BJP అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ గెలుస్తుందని చివరి వరకు అనుకున్నా అనూహ్యంగా BJP గెలవడానికి 25 లక్షల అక్రమ ఓట్లేనన్నారు. హరియాణాలో 2 కోట్ల ఓట్లుంటే అందులో 8వ వంతు దొంగ ఓట్లేనని రాహుల్ ఆరోపించారు. ‘H బాంబ్’ పేలుస్తామంటూ గత కొన్నిరోజులగా చెబుతున్న ఆయన.. ఈరోజు వాటి వివరాల్ని ప్రకటించారు. హస్తం పార్టీదే అధికారమని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని, కానీ అందుకు విరుద్ధంగా జరగడం నకిలీ ఓట్లేననన్నారు.