తొమ్మిది సంవత్సరాల BJP పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని, అందుకే ఇప్పుడు I.N.D.I.A., N.D.A. మధ్య పోరాటం స్టార్ట్ అయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిందని, మొత్తం ధనమంతా ఎన్నికైన నేతల జేబుల్లోకి వెళ్తోందన్నారు. విపక్ష కూటమి బెంగళూరులో నిర్వహించిన మీటింగ్ అనంతరం రాహుల్ ప్రసంగించారు. రైల్వే, ఓడరేవు, ఎయిర్ పోర్టులను అమ్మకానికి పెట్టారన్న రాహుల్.. కమలం పార్టీ పాలనలో రైతులు, యువత, వ్యాపారులు ఇలా అందరూ ఆవేదనలో ఉన్నారని విమర్శించారు.
BJP రహిత పాలన గల రాష్ట్రాలను కేంద్రం కావాలనే వేధిస్తున్నదని, ఈ విపత్తు నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ అన్నారు. విమర్శిస్తేనే విపక్షాలపై దృష్టి పెడుతున్నారని, CBI, EDలను ఉసిగొల్పుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మమత ఫైర్ అయ్యారు. భారత్ గెలుస్తుంది.. భాజపా ఓడుతుందంటూ భరోసా వ్యక్తం చేశారు.