ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలి, కేరళలోని వయనాడ్ నియోజకవర్గాల నుంచి గెలిచిన రాహుల్ గాంధీ.. ఒక సీటును వదులుకోవాల్సిన పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్ కు తెరదించుతూ AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రెసిడెంట్ సోనియాగాంధీ, కె.సి.వేణుగోపాల్ తో చర్చించిన అనంతరం తాను వదులుకునే సీటును ప్రకటించారు. రాయ్ బరేలి(Rae Bareli)కి జై కొట్టిన హైకమాండ్.. వయనాడ్ నుంచి ప్రియాంకగాంధీని పోటీలో నిలపబోతున్నారు.
ఖర్గే ప్రకటనతో…
వయనాడ్(Wayanad) సీటును రాహుల్ వదులుకున్నట్లు AICC చీఫ్ ఖర్గే అధికారికంగా ప్రకటించారు. ఆ స్థానంలో ప్రియాంక పోటీ చేస్తారని తెలిపారు. అటు వయనాడ్ వదులుకుంటున్నా రెగ్యులర్ గా అక్కడకు వెళ్లి వస్తానని రాహుల్ అన్నారు.