
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి వచ్చిన సర్వేలు ఎగ్జిట్ పోల్స్(Exit Polls) కాదని, అవి మోదీ పోల్స్ అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్ అవేని కల్పితమని, తమ కూటమి మనోస్థైర్యాన్ని తగ్గించే వ్యూహంలో భాగమే అవి అని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో కాంగ్రెస్ నేతలెవరూ పాల్గొనబోరని నిన్ననే స్పష్టం చేసిన AICC… సర్వేలన్నీ బూటకమని విమర్శించింది.
శనివారం ప్రకటించిన అన్ని సర్వేల్లోనూ NDA కూటమిదే అధికారమని తేలింది. BJP సాధించే సీట్లలో ఇండియా కూటమికి కనీసం సగం కూడా రావట్లేదని తెలిపాయి. దీంతో ఈ సర్వేలపై కాంగ్రెస్ అగ్రనేతలు మండిపడితే.. తాజాగా రాహుల్ సైతం అవి మోదీ చెప్పినట్లు ఆడే మీడియా సంస్థలు అని విమర్శలు చేశారు.