కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధిహామీ పథకం కూలీని రూ.400 చేస్తామని కాంగ్రెస్(AICC) అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ సర్కారు ప్రైవేటు పరం(Privatization) చేస్తున్నదని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం(Campaign)లో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న రాహుల్.. BJP విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు.
దేశంలో రెండు వర్గాల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని, అందులో రాజ్యాంగాన్ని(Constitution) రక్షించేది ఒకటైతే… రాజ్యాంగాన్ని మార్చాలన్నది మరొకటి అని గుర్తు చేశారు. ప్రైవేటీకరణను పెంచి రిజర్వేషన్లను రద్దు చేయడమే మోదీ సర్కారు లక్ష్యమని వివరించారు.