పెళ్లెప్పుడంటూ ఎవర్నయినా పెద్దవాళ్లు అడిగితే.. పెళ్లి కాని ఇతర వ్యక్తులకు కూడా అదోలా ఉంటుంది. అలాంటి స్థితిలోనూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలివిగా వ్యవహరించారు. ఆయన బిహార్ పర్యటనలో ఈ సరదా సన్నివేశం జరిగింది. పెళ్లి చేసుకోవాలంటూ కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కు RJD నేత తేజస్వి యాదవ్ సలహా ఇచ్చారు. ఇది విన్న 55 ఏళ్ల రాహుల్.. అది నాకు కూడా వర్తిస్తుంది.. నా పెళ్లికి ఇంకా మీ నాన్నతో చర్చలు జరుగుతున్నాయంటూ నవ్వులు పూయించారు. అసలు కథేంటంటే… వివాహం చేసుకోవాలంటూ రెండేళ్ల క్రితమే రాహుల్ తో లాలూ ప్రసాద్ అన్నారు. మా తల్లి సోనియాకు నన్ను బరాత్ లో చూడాలని ఉందని జవాబిచ్చారు. ఇప్పుడు లాలూ తనయుడు తేజస్వి ఇదే టాపిక్ ఎత్తడంతో.. మీ నాన్నతో ఇంకా చర్చలు జరుగుతున్నాయంటూ చమత్కరించారు.