కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి భారత్-పాక్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ప్రధానిపై విరుచుకుపడ్డారు. 24 గంటల్లో యుద్ధం ఆపాలంటూ అమెరికా అధ్యక్షుడు అల్టిమేటం ఇచ్చారని, కానీ మోదీ దానికి భయపడి 5 గంటల్లోనే ముగింపునిచ్చారని విమర్శించారు. అగ్రరాజ్యానికి భయపడి ఆపరేషన్ సిందూర్ ఆపేస్తే మరి భారత్ పై టారిఫ్స్ ఎందుకు వేశారంటూ BJP ముంబయి నేత పల్లవి.. రాహుల్ ను ప్రశ్నించారు. తాను యుద్ధం ఆపలేదని గతంలోనే ట్రంప్ ప్రకటించినా కాంగ్రెస్ అగ్రనేతకు అర్థం కావట్లేదని మరికొందరు కమలం నేతలు ఎదురుదాడికి దిగారు.