రాష్ట్ర మంత్రివర్గ(Cabinet) విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం చర్చలు జరిపింది. రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో రాష్ట్ర నేతలు ఢిల్లీలోని ఇందిర భవన్లో సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు చర్చకు వచ్చినట్లు PCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. PCC కార్యవర్గం, ఇతర బోర్డుల రిక్రూట్మెంట్ల గురించి సైతం అధిష్ఠానం పెద్దలతో ప్రస్తావించామన్నారు. హెల్త్, ఎడ్యుకేషన్ గురించి రాహుల్ ఆరా తీశారని మహేశ్ తెలిపారు.