ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పదే పదే చైనా పేరు ప్రస్తావించడం విమర్శలకు దారితీసింది. లోక్ సభలో ప్రసంగిస్తూ భారత్-చైనా మధ్య పోలికల్ని వివరించారు. మేకిన్ ఇండియా ఉద్దేశం మంచిదే అయినా ఆ విషయంలో మోదీ సర్కారు విఫలమైందని విమర్శించారు. భారత్ భూభాగంలో చైనా ఆక్రమణ ఇప్పటికీ అలాగే ఉందని, సైన్యం చెప్పే మాటలకు పొంతన లేదన్నారు. మాన్యుఫాక్చరింగ్ లో చైనా ముందంజలో ఉంటే, భారత్ ఎంతో దూరంలో నిలిచిందన్నారు. డ్రాగన్ దేశం మనకంటే పదేళ్ల ముందుందని, బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్స్, కార్లు, బ్యాటరీల వంటి రంగాల్లో రెండు దేశాల్ని మళ్లీ మళ్లీ ప్రస్తావించారు. రాహుల్ మాట్లాడిన వీడియోల్ని BJP ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రాహుల్ గాంధీకి చైనా అంటే ఇష్టమని, భవిష్యత్తులో ఆయన అక్కడే సెటిల్ అవుతారంటూ BJP నేతలు విమర్శలు చేశారు. తన 45 నిమిషాల ప్రసంగంలో ఆయన చైనా పేరును 34 సార్లు ప్రస్తావించారంటూ అమిత్ మాలవీయ షేర్ చేసిన వీడియోలో పాయింట్ అవుట్ చేశారు.