Published 26 Nov 2023
అధికారంలోకి వస్తే BCని సీఎం చేస్తామని చెబుతున్న BJP.. ముందుగా 2 శాతం ఓట్లు తెచ్చుకుని మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. 2 శాతం ఓట్లు తెచ్చుకున్న తర్వాత OBC సీఎం గురించి మాట్లాడండంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. కమలం పార్టీ, కేసీఆర్ పార్టీ టైర్లలో గాలిని హస్తం పార్టీ తీసేసిందన్న రాహుల్.. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలు లాక్కునేందుకే ధరణి అని విమర్శించారు. కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టడమే MIM టార్గెట్ అని, తమకు ఎక్కడ గట్టి పట్టు ఉంటుందో ఆయా రాష్ట్రాల్లో మజ్లిస్ ను BJP పోటీకి దింపుతుందని ఆరోపించారు.
అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలపై చట్టంగా తయారు చేస్తామన్నారు. మోదీ సర్కారుకు కేసీఆర్, తెలంగాణ సర్కార్ కు BJP అన్న రీతిలో రెండు పార్టీల మధ్య సంబంధాలు నడుస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు.