
రాష్ట్రంలో జరుగుతున్న వరుస సోదాలు, దాడులను చూస్తే కాంగ్రెస్ ను కావాలనే టార్గెట్ చేస్తున్నారని PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ హవాను అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రలో ఇదంతా భాగమన్నారు. ఖమ్మంలో నిన్న తుమ్మల నాగేశ్వర్ రావు ఇంటిపై దాడులు నిర్వహించగా.. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలు, ఆఫీసుల్లోనూ IT, ED అధికారులు విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు.
దీనిపై రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడుతూ BJP, BRS కలిపి చేస్తున్న దాడిగా కామెంట్ చేశారు. ‘BJP, BRS నేతల ఇళ్లపై ఎందుకు దాడులు చేయడం లేదు.. కాంగ్రెస్ సునామీని అడ్డుకునేందుకే ఇలా వరుస దాడులకు దిగుతున్నారు’ అంటూ రేవంత్ విమర్శించారు.