
BRSను తిట్టడంలో పోటీ పడుతున్న BJP నేతలు నిధులు తేవడంలో ఎందుకు పోటీ పడటం లేదని తెలంగాణ ఫుడ్స్ ఛైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అన్నారు. అసలు రైతులకు ఏం చేశారని ఖమ్మంలో కర్షకుల పేరిట సభ పెట్టారని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు బీమా ఉందని, పెట్టుబడి సాయం అందించేందుకు రైతు బంధు పథకాన్ని తమ పార్టీ అమలు చేస్తోందన్నారు. రైతు బంధును ఆదర్శంగా తీసుకునే కేంద్రం.. కిసాన్ సమ్మాన్ యోజన తీసుకువచ్చిందని, తమ స్కీమ్ లనే కాపీ కొడుతూ ప్రజలకు మాయ మాటలు చెబుతున్నారని రాజీవ్ సాగర్ విమర్శించారు.
రైతు వ్యతిరేక బిల్లులు తీసుకురావాలని యత్నించిన ఘనత కమలం పార్టీదంటూ ఆయన ఫైర్ అయ్యారు. వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నెలల పాటు ఆందోళనలు చేసిన విషయం అప్పుడే మరచిపోయారా అని ప్రశ్నించిన రాజీవ్ సాగర్.. ఈ విషయాన్ని ఇంకా ప్రజలు మరచిపోలేదని గుర్తు చేశారు.