‘ఆపరేషన్ సిందూర్’లో ఎన్ని పాక్ విమానాలు నేలకూల్చారని ఒక్కరూ అడగట్లేదని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ విపక్షాలపై మండిపడ్డారు. ఎన్ని భారత విమానాలు కూలాయి.. ఎంతమంది సైనికులు గాయపడ్డారు.. అన్న ప్రశ్నలే తప్ప శత్రు దేశానికి వాటిల్లిన నష్టంపై ఒక్కరూ నోరు మెదపడం లేదన్నారు. వాళ్లకు జాతీయవాదంతో పని లేనట్లుంది అంటూ రాజ్ నాథ్ ఎదురుదాడికి దిగారు. ఉగ్రవాదులు పారిపోయేలా మనం సాయం చేశామా లేదా అన్నది చెప్పాలంటూ కాంగ్రెస్ MP గౌరవ్ గొగోయ్ మాట్లాడటంతో.. స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం తెలిపారు. తప్పుదారి పట్టించే ప్రశ్నలు వేయొద్దని స్పష్టం చేశారు.