
దిల్లీ పాలనాధికారాల బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 102 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటికే ఈ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసింది. ఇక రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయగానే దిల్లీ సర్వీసుల(నేషనల్ క్యాపిటల్ టెరిటోరి ఆఫ్ దిల్లీ) బిల్లు చట్టంగా రూపాంతరం చెందుతుంది. టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా రాజ్యసభలో స్లిప్ ల(Slips) ద్వారా ఓటింగ్ నిర్వహించారు. మొన్నటి మార్చిలో అనర్హత వేటు పడిన వయనాడ్ MP రాహుల్ గాంధీ.. ఈనెల 4న సుప్రీంకోర్టు ఇచ్చిన ‘స్టే’తో పార్లమెంటులో అడుగుపెట్టారు. ఈ దిల్లీ సర్వీసుల బిల్లుకు సంబంధించి కాంగ్రెస్ తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ముందుగానే తమ సభ్యులకు విప్ జారీ చేశాయి.
దిల్లీ ప్రజల హక్కుల్ని కాలరాస్తున్న బిల్లుకు నిరసనగా ‘బ్లాక్ డే’గా పాటించాలని దిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. మేం చేసే మంచిని BJP ఆపాలని చూస్తున్నదని ఫైర్ అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రధానమంత్రి పాటించలేదన్న కేజ్రీవాల్… మేం ఏం చేసినా దిల్లీ ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు.