క్రికెట్ నుంచి రిటైర్ మెంట్(retirement) ప్రకటించాక అంబటి రాయుడు రాజకీయాల్లోకి అడుగుపెడతాడని ప్రచారం జరిగింది. ఆయన తీరును చూసినవాళ్లు ఇక పాలిటిక్స్(politics)కు రావడమే తరువాయి అన్నట్లుగా మాట్లాడారు. కానీ ప్రస్తుతానికి తాను రాజకీయాల్లోకి రావడం లేదని రాయుడు అన్నాడు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అక్షయపాత్ర వంటశాలను పరిశీలించిన సందర్భంగా మాట్లాడారు. తన దృష్టంతా సమాజ అధ్యయనంపైనే ఉందని, రాజకీయ పార్టీల వైపు వెళ్లడం లేదని స్పష్టతనిచ్చారు.
‘నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు.. సోషల్ సర్వీస్ యాక్టివిటీ చేసేవాళ్లను కలుసుకుంటున్నా.. అక్షయ పాత్ర అందిస్తున్న గ్రేట్ సర్వీసును పరిశీలించేందుకే మంగళగిరికి వచ్చా.. ఎవరెవరితో కలిసి ఎలాంటి సర్వీసు చేయవచ్చో తెలుసుకుంటున్నా’ అని అన్నాడు.