ముఖ్యమంత్రి కావాలన్న కల నెరవేరిందని, అంత పెద్ద పదవి కంటే ఇంకేం కలలు(Dreams) లేవని రేవంత్ రెడ్డి అన్నారు. రాజమౌళి, రాంగోపాల్ వర్మ స్టయిల్స్ ఎలాగో తనది, KTRది వేర్వేరు స్టయిల్స్ గా చెప్పుకొచ్చారు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న ప్రచారాన్ని ఖండించిన రేవంత్.. దేశవ్యాప్తంగా స్థిరాస్తి రంగంలో స్తబ్ధత ఏర్పడిందన్నారు.
మూసీపై ముందుకే వెళ్తామని, దానికి మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలిస్తామన్నారు. రాష్ట్రానికి హైదరాబాద్ నుంచి 65 శాతం ఆదాయముంటోందన్న CM.. రాష్ట్రాన్ని KCR అప్పుల పాల్జేసినా రుణమాఫీ చేశామని గుర్తు చేశారు.