
గజ్వేల్ లో ఓడిపోతానని భయపడి కామారెడ్డిలో పోటీ చేస్తున్న KCR నిర్ణయంతో అక్కడి MLA గంప గోవర్ధన్ శాపనార్థాలు పెడుతున్నాడని PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మనవడిని మంత్రిని చేసేందుకే మూడోసారి ముఖ్యమంత్రి చెయ్యాలంటున్నారని మండిపడ్డారు. కామారెడ్డిలో నామినేషన్ వేసిన అనంతరం నిర్వహించిన BC డిక్లరేషన్ సభలో ఆయన మాట్లాడారు. తాను MLA కావడం పెద్ద విషయం కాదని, ఎక్కడో ఒకచోట పోటీ చేసి గెలవగలనన్న రేవంత్.. ముఖ్యమంత్రిని ఓడించేందుకు, కేసీఆర్ తెలంగాణకు చేసిన ద్రోహానికే కామారెడ్డిలో పోటీకి దిగానని చెప్పారు.
కర్ణాటకకు వస్తే స్కీమ్స్ చూపిస్తాం
కర్ణాటకలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని BRS నేతలు అంటున్నారని, కానీ మా రాష్ట్రానికి వస్తే మేం ఏం చేస్తున్నామో చూపిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మోదీ సర్కారు వల్ల దేశం దివాళా తీసిందని BC డిక్లరేషన్ సభా వేదికగా విమర్శించారు.
వీహెచ్ డైరెక్ట్ అటాక్
సభకు అటెండ్ అయిన వి.హన్మంతరావు.. తమ పార్టీ లీడర్లపై మరోసారి విరుచుకుపడ్డారు. ఎవరికి వారే సీఎం అని చెప్పుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదంటూ కామెంట్స్ చేశారు. ముందుగా ఎన్నికల్లో గెలిస్తే CM ఎవరో సోనియా, రాహుల్ నిర్ణయిస్తారని.. ప్రజల్లో ఎవరికి అభిమానం ఉంటే వారే ముఖ్యమంత్రి అవుతారన్నారు. సభలోనే ఉన్న రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే వైపు చూస్తూ… ఈ విషయాన్ని మీరైనా చెప్పండి అనడంతో అంతటా నవ్వులు విరిశాయి.