కృష్ణా జలాల(Krishna Water)పై కీలక చర్చ జరుగుతున్న సమయంలో సభకు రావాల్సిన ప్రధాన ప్రతిపక్ష(Opposition) నాయకుడు ఫామ్ హౌజ్ లో దాక్కున్న మహానుభావుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఇంతకంటే కీలకమైన అంశం(Serious Issue) తెలంగాణకు ఏమైనా ఉందా అని ప్రశ్నించిన CM… రాష్ట్ర ప్రజలకు వినిపించాల్సిన వాస్తవాల్ని వివరించాల్సి వచ్చినపుడు ముఖ్య నేత సభకు రాకపోవడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమే(Insult)నని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు.
ప్రతిపక్ష నేత కుర్చీపై…
మొన్నటిదాకా కేసీఆర్ కుర్చీ ఖాళీగా ఉండేదని, ఇప్పుడా కుర్చీలో పద్మారావు కూర్చున్నారన్న రేవంత్.. శాశ్వతంగా బాధ్యతలు ఇస్తే ఆయనైనా బాధ్యతలు నెరవేరుస్తారని అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన నిజమైన లీడర్ పద్మారావు ఆ స్థానానికి న్యాయం చేయగలరన్న నమ్మకం తమకుందని తెలిపారు. 68 శాతం మేర అంటే 551 TMCల నీళ్లు తెలంగాణకు రావాలని తీర్మానం ప్రవేశపెడితే దానికి అనుకూలమా, కాదా అని చెప్పకుండా శత్రువులకు బలం చేకూర్చేలా BRS నేతలు వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు చేశారు.