కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న దీక్షను చెడగొట్టేందుకే విద్యుత్ వివాదం తెచ్చారని PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. 24 గంటల ఉచిత కరెంట్ పేరుతో KCR మోసం చేస్తున్నారని, విద్యుత్ సంస్థలను రూ.60 వేల కోట్లకు ముంచారని ఆరోపించారు. రాష్ట్రంలో సాగుదారులకు 12 గంటలు కూడా క్వాలిటీ పవర్ ఇవ్వడం లేదని, BRS మోసాలను ఖండిస్తూ రేపు సబ్ స్టేషన్ల వద్ద నిరసనలు చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు రేవంత్ పిలుపునిచ్చారు.
BJPకి BRS బీ టీమ్ అని మరోసారి రుజువైందన్న రేవంత్… రాహుల్ పై అనర్హత వేటుకు నిరసనగా రేపు సత్యాగ్రహ దీక్షలకు దిగాలని కేడర్ కు సూచించారు.