ధరణి విషయంలో పెద్ద గూడుపుఠాని దాగి ఉందని, దాని మేనేజ్ మెంట్ మొత్తం ప్రైవేటు వ్యక్తిలో చేతిలో ఉందని PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. పైకి టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ కనిపిస్తున్నా దాని వెనుక పెద్ద బాగోతం నడుస్తోందని.. బ్రిటీష్ ఐలాండ్స్ చేతిలో ఉందని విమర్శించారు. ప్రొహిబిటివ్ లిస్టులో ఉన్న భూములకు రాత్రికి రాత్రే ఓనర్లను సృష్టించడం వారి పేరు మీద ట్రాన్స్ ఫర్ చేయడం జరుగుతూనే ఉందన్నారు. కోదండరెడ్డితో కలిసి ఆయన భూడిక్లరేషన్ విడుదల చేశారు.
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత భూ అక్రమాలపై పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేయిస్తామన్నారు. ధరణిని క్యాన్సిల్ చేస్తామంట్ KCR భయపడుతున్నారని రేవంత్ అన్నారు.